Available Here: Goat Breeding

Goat & Sheep Farming Guide for Beginners - Characteristics of breeding animals

Dislike 0 Published on 8 Apr 2020

#BreedingGoat #BreedingRam

Telegram Link
https://t.me/joinchat/HF1BJVBOPHUUVwcJvvqBWA

చాలా మంది గొర్రెల యజమానులు, పెంపకందారులు మందలో పుట్టిన పొట్టేళ్ళు పిల్లలనే చాలా మంది విత్తన పొట్టేళ్లుగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు. వాటి రక్త సంబంధిత వ్యాధులు సంతతిపై పొర్లే అవకాశం ఉంది. దీనిని ఇన్‌ బ్రీడింగ్‌ అంటారు. దగ్గరి సంబంధమున్న గొర్రెలు, పొట్టేళ్ల సంపర్కం వల్ల పుట్టే జీవాలు బలహీనంగా ఉండటంతో పాటు అవిటితనంతో, సంతానోత్పత్తికి పనికి రానివిగా పుడతాయి. అందువల్ల మందపై వదిలే విత్తన పొట్టేళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టేళ్లను రెండు సంవత్సరాలకోసారి మార్పు చేయాలి. వేరొక మంద నుంచి గానీ, మంచి లక్షణాలులున్న వాటిని మందలో వదలాలి.
పొట్టేళ్ల ఎంపిక ఇలా...
విత్తన పొట్టేళ్ల కోసం నెల్లూరు జాతిని ఎంపిక చేసుకోవాలి. ఇందులో నెల్లూరు గోదుమ, నెల్లూరు జోపిడి లాంటి జాతి లక్షణాలు బాగుంటాయి. చక్కటి శరీర సౌష్టవం, పొడవు, ఎత్తు బరువు ఉండే వాటిని ఎంచుకోవాలి. కాలికి గిట్టలు బాగుండడంతోపాటు చురుకుదనం కలిగి ఉండాలి. వృషణాలు రెండూ సమానంగా, వయస్సుకు సరిపడ పరిమాణంలో ఉండాలి. పొట్టేళ్లు మందపై వాడే పొట్టేళ్లుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉండాలి. ఇలాంటి వాటితో జత కలిపితే ఆరోగ్యవంతమైన, చురుకైన జీవాలు నిర్ణీత బరువుతో పుట్టడమే గాక పునరుత్పత్తి జరిగి అధిక లాభాలనిస్తాయి. మందలో ప్రతి 25 గొర్రెలకు ఒక పొట్టేలు తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటే మంద ఉత్పత్తి
జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి గొర్రె నుంచి మేలు రకమైన ఆరోగ్య వంతమైన పల్లలు పుడతాయి. దీంతో గొర్రెల పెంపకందారులకు మంచి ఆదాయం వస్తుంది.